
సిమ్లా: ఐపీఎల్ 18లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు అయింది. పాక్ ఆక్మసిక దాడుల నేపథ్యంలో మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ధర్మశాలలో బ్లాక్ అవుట్ (పూర్తిగా విద్యుత్ నిలిపివేత) ప్రకటించడంతో మధ్యలోనే మ్యాచ్ ఆగిపోయింది. తక్షణమే ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని సూచించారు. పాక్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాచును రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు ప్రకటించారు. హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్ల ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా, ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా గురువారం (మే 8) రాత్రి పాకిస్థాన్ మెరుపు దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లతో సరిహద్దు నగరాలపై విరుచుకుపడింది. పాక్ దాడుల నేపథ్యంలో దాయాది దేశ సరిహద్దు జిల్లాల్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ ఔట్ ప్రకటించారు. ధర్మశాల, జమ్ము, ఉధంపూర్, అఖ్నూర్, పఠాన్‌కోట్, అమృత్ సర్, జలంధర్ ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ ఔట్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ధర్మశాలలో బ్లాక్ ఔట్ ప్రకటించడంతో మ్యాచ్ మధ్యలోనే స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేశారు.
దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. పాక్ దాడులు తీవ్రతరం చేస్తుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా మ్యాచ్‌ను రద్దు చేశారు అఫిషియల్స్. ఈ మ్యాచులో టాస్ గెలిచి పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది పంజాబ్. ఈ క్రమంలో బ్లాక్ ఔట్ ప్రకటించడంతో మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. పాక్ భీకరంగా దాడులు చేస్తుండటంతో ప్రభుత్వ సూచనల మేరకు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
►ALSO READ | PBKS vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. ఢిల్లీ జట్టులో కొత్త ప్లేయర్!