PBKS vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. ఢిల్లీ జట్టులో కొత్త ప్లేయర్!

PBKS vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. ఢిల్లీ జట్టులో కొత్త ప్లేయర్!

ధర్మశాల వేదికగా గురువారం (మే 8) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో కుదేలైన ఢిల్లీకి ఈ మ్యాచ్ లో గెలవడం అత్యంత కీలకం. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదవ స్థానంలో ఉంది. 

మరోవైపు 11 మ్యాచ్ ల్లో 15 పాయింట్లతో పంజాబ్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ తో పాటు టేబుల్ టాప్ కు చేరుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.  విప్రజ్ నిగమ్ స్థానంలో మాధవ్ తివారీ జట్టులోకి వచ్చాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ 

►ALSO READ | Team India: గిల్, పంత్ చేతిలో టెస్ట్ భవిష్యత్ పెట్టొద్దు.. అతనికే కెప్టెన్సీ ఇవ్వాలంటున్న మదన్ లాల్, కుంబ్లే