టెన్త్​ బెటాలియన్ అభివృద్ధిపై ఫోకస్

టెన్త్​ బెటాలియన్ అభివృద్ధిపై ఫోకస్

గద్వాల, వెలుగు: టెన్త్ బెటాలియన్ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గురువారం బెటాలియన్ ను సందర్శించారు. సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్​ పార్క్ ను ప్రారంభించారు.  సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. గద్వాల ఎస్పీ శ్రీనివాస రావు, బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, అడిషనల్ కమాండెంట్ జయరాజు తదితరులు పాల్గొన్నారు.