ఆఫ్ఘన్ నుంచి మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణుల తరలింపు

ఆఫ్ఘన్ నుంచి మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణుల తరలింపు

దోహా: ఆఫ్ఘనిస్తాన్ నుంచి మహిళా క్రీడాకారిణులను వారి కుటుంబాలతో సహా తరలించారు. తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళలు ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ఇళ్లలో నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో వారి తరలింపునకు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య చొరవ తీసుకుంది. 100 మంది మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణులను రాజధాని కాబుల్ నుంచి దోహాకు తరలించారు. ఈ మేరకు కతార్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి లోల్వాహ్ అల్ ఖతెర్ ట్వీట్ చేసి వెల్లడించారు. 
ముందుగా ఫుల్ బాల్ క్రీడాకారిణులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించారు. అనంతరం కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దోహాకు తరలించారు. వీరు ఎంత కాలం కతార్ దేశంలో ఉంటారనేది స్పష్టం చేయలేదు. అయితే క్రీడాకారిణుల తరలింపు కోసం తాము సహకరించినట్లు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించింది.