- ఏఐసీసీ కార్యదర్శి కుసుమ కుమార్
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఇప్పటి నుంచే సిటీలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని హైకమాండ్ తనను ఆదేశించిందని ఒడిశాకు ఏఐసీసీ సహాయ కార్యదర్శిగా నియమితులైన జెట్టి కుసుమ కుమార్ చెప్పారు.
గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటు తెలంగాణలో అటు ఒడిశాలో కాంగ్రెస్ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ లో పనిచేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని.. తనకు పదవి రావడం ద్వారా ఈ విషయం మరోసారి నిరూపితమైందని అన్నారు.
