వెంకటాపూర్(రామప్ప)/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా పర్యాటక కేంద్రాలను సోమవారం ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు సందర్శించారు. ముందుగా రామప్ప టెంపుల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా సంస్థ ఈడీ ఎస్ కె.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేశ్‌కుమార్, పర్వింద్ర తివారి, డీజీఎం వసీం, ఏజీఎం గోపాలకృష్ణ, బేగంపేట విమానాశ్రయ అధికారులు, సిబ్బంది సందర్శించి, ఆలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో ఇమ్మడి భాస్కర్ వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఓరుగల్లు కోటను వారు సందర్శించారు. ఆయా పర్యాట కేంద్రాల గురించి గైడ్స్ వారికి వివరించారు.

