లాభాల్లో 35 శాతం వాటా ప్రకటించండి : ఏఐటీయూసీ

లాభాల్లో 35 శాతం వాటా ప్రకటించండి :  ఏఐటీయూసీ
  • సీఎం రేవంత్ ​రెడ్డిని కలిసిన ఏఐటీయూసీ నేతలు
  • కొత్త బొగ్గు గనులు వచ్చేలా కృషి చేయాలని విన్నపం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ 2024–25లో ఆర్జించిన లాభాలను ప్రకటించి, కార్మికులకు 35 శాతం వాటా పంపిణీ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ ​రెడ్డికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు విన్నవించారు. శనివారం హైదరాబాద్​లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్​ సెక్రటరీ కొరిమి రాజ్​కుమార్ ​తదితరులు సీఎంను కలిశారు. 

కార్మిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు లీడర్లు తెలిపారు. సొంతింటి పథకం అమలు, మెడికల్​ బోర్డు ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న అందరినీ ఆన్​ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మార్ల పేర్ల సమస్య విషయంలో అడ్వకేట్​ జనరల్ ​న్యాయ సలహా త్వరగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని, పెర్క్స్​పై రికవరీ చేసి ఇన్​కమ్ ​ట్యాక్స్​ను కార్మికులకు రిఫండ్​చేయాలని కోరారు. కొత్త గనులు వచ్చేలా కృషి చేయాలన్నారు. 

స్పందించిన సీఎం సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దసరా తర్వాత సంబంధిత మంత్రులు, యాజమాన్యం, యూనియన్​ను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని సీతారామయ్య తెలిపారు. లాభాల వాటా విషయంలో యాజమాన్యం, గుర్తింపు సంఘం చర్చించుకొని సంబంధిత మంత్రిని కలిసి తగు నిర్ణయం తీసుకోమని ఆదేశాలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.