మా పార్టీ 80 సీట్లు గెలిచినా.. EVMలను నమ్మేది లేదు : అఖిలేష్ యాదవ్

మా పార్టీ 80 సీట్లు గెలిచినా.. EVMలను నమ్మేది లేదు : అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఆ పార్టీ ఎంపీ అయిన అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. లోక్ సభలో మాట్లాడుతూ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ 37 సీట్లను గెలిచింది.. అయినా కూడా ఈవీఎంలను నమ్మడం లేదు.. ఒక వేళ తమ పార్టీ 80కి 80 సీట్లు  గెలిచినా కూడా ఈవీఎంలను నమ్మేది లేదంటూ లోక్ సభలో సంచలన కామెంట్స్ చేశారు అఖిలేష్ యాదవ్. 

ఈవీఎంల వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందని.. వాటి వినియోగంపై అనుమానాలు ఉన్నాయంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈవీఎంలను తొలగించే వరకు, సమాజ్ వాదీ మద్దతుదారుల పోరాటం ఆగదన్నారు.  లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా అఖిలేష్ ఈ కామెంట్స్ చేశారు.  

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించే దాకా మా పోరాటం ఆగదు' అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు.