- ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ పీసీసీ చీఫ్మహేశ్గౌడ్
- ఈసారి చాలెంజ్ గా తీసుకున్న బీజేపీ ఎంపీ అర్వింద్
- మున్సిపల్ పదవుల్లో కీరోల్ కోసం మజ్లిస్ వ్యూహాలు
- బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్న కవిత
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గెలుపును ప్రధాన పార్టీలు టార్గెట్ చేశాయి. టీ పీసీసీ చీఫ్మహేశ్గౌడ్సొంత జిల్లా కావడంతో పాటు కాంగ్రెస్సీనియర్లీడర్లు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కూడా సవాల్ గా తీసుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పైనే ఆయన పూర్తిగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తలెత్తిన పరిణామాలతో ఆ పార్టీని దెబ్బతీసేందుకు జిల్లా కోడలు, జాగృతి చీఫ్కవిత పావులు కదుపుతున్నారు. మరోవైపు మజ్లిస్ కీ రోల్ పోషించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
బీజేపీని కట్టడి చేసేందుకు..
టీ పీసీసీ ప్రెసిడెంట్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ సింబల్ లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్మద్దతుదారులు జిల్లాలో 80 శాతం మంది గెలిచారు. మున్సిపల్ఎన్నికలు సింబల్ కావడంతో ఆయన చాలెంజ్ గా తీసుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
2005లో నిజామాబాద్ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్గెలిచింది. అప్పటి ఏపీసీసీ చీఫ్డి.శ్రీనివాస్పెద్ద కొడుకు డి.సంజయ్మేయర్అయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్జెండా ఎగరవేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లో ఉంది. జిల్లాకు చెందిన మహేశ్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. దీంతో జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్మున్సిపాలిటీలను సవాల్‌గా తీసుకున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణలు అనుకూలిస్తే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో మహేశ్ గౌడ్ ఉన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ నుచేజిక్కించుకుంటే, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నా రు.
ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయడానికి మున్సిపల్ ఎన్నికలను వేదిక చేసుకుని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ సక్సెస్వ్యూహాలు పన్నుతున్నారు. పైరవీలకు చోటు లేకుండా గెలుపు గుర్రాలనే పోటీ చేయించాలని ఫిక్స్అయ్యారు. ఇప్పటికే కొందరు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు.
గతంలో పార్టీ చీఫ్‌గా పనిచేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మున్సిపల్ఎన్నికలకు నిజామాబాద్లోక్ సభ సెగ్మెంట్ ఇన్చార్జ్గా నియమితుల య్యారు. ఆయన సారథ్యంలో గెలుపు వ్యూహాలను రూపొందిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్ల లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగరేయాలని
గత మున్సిపల్ ఎన్నికల్లో మేయర్కుర్చీ స్వల్ప తేడాతో బీజేపీకి దూరమైంది. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 28 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించింది. అయినా మేయర్ పదవిని దక్కించుకోలేపోయింది. బీఆర్ఎస్13 మంది కార్పొరేటర్లను మాత్రమే గెలిచినా.. మజ్లిస్‌కు చెందిన16 మంది కార్పొరేటర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది.
అప్పటి ఎక్స్అఫిషియో సభ్యులు ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, డి.రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ ఓట్లతో మేయర్ పీఠం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ పోస్టును మజ్లిస్‌కు ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో గతంకంటే అధిక డివిజన్లను గెలుచుకుని కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరేయాలని ఎంపీ అర్వింద్ధీమాతో ఉన్నారు.
జిల్లా బీజేపీ పాలిటిక్స్ అర్వింద్‌కు ముందు ఆయనకు తర్వాతగా మారాయి. వ్యక్తిగతంగా తన ఇమేజ్పెంచి పార్టీని విస్తరించే చాన్స్ ను ఆయన మున్సిపల్ ఎన్నికలను పరిగణిస్తున్నారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్సొంత మున్సిపాలిటీతోపాటు బోధన్‌పై కూడా దృష్టిసారించారు. కాగా.. పార్టీలో కొత్తగా జాయిన్ అయినవారిని పోటీ చేయిస్తారనే ప్రచారంతో సీనియర్లు నారాజ్అవుతున్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయం కష్టతరంగా మారింది.
గెలిచే స్థానాలపైనే మజ్లిస్ ఫోకస్
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపాలిటీల్లోని అన్ని డివిజన్లలో కాకుండా గెలిచే సీట్లపైనే మజ్లిస్ప్రధానంగా ఫోకస్ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పదవుల ఎన్నిక సమయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాలనే వ్యూహాలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
గత ఎన్నికల్లో నిజామాబాద్‌లో 16 డివిజన్లు గెలుపొందడంతో పాటు మరో నాలుగు చోట్ల గెలిచేందుకు ప్లాన్చేశారు. 2014 ఎన్నికల్లో కూడా నిజామాబాద్మేయర్పదవిని మజ్లిస్సపోర్ట్తో బీఆర్ఎస్ దక్కించుకుంది. బోధన్మున్సిపల్ చైర్మన్ కుర్చీని మజ్లిస్‌కు బీఆర్ఎస్ వదులుకుంది. కానీ.. అప్పటి లోకల్ ఎమ్మెల్యే షకీల్ రాజకీయ వ్యూహాలు పన్ని మజ్లిస్‌కు పదవి దక్కకుండా చేశారు. చైర్మన్ సీటును సైతం బీఆర్ఎస్లాగేసుకుంది.
వైస్ చైర్మన్ పోస్టుతో మజ్లిస్సరిపెట్టుకుంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్, బోధన్‌లో కీలకంగా వ్యవహరించి సత్తా చాటాలని మజ్లిస్స్కెచ్వేసింది. కాగా.. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో తమ గెలుపు ఖాయమనికాంగ్రెస్ భావిస్తోంది.
బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేసేందుకు..
పదేండ్లు నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ఆ పార్టీవీక్అయింది. బాల్కొండ సెగ్మెంట్లో మాత్రమే పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.
ఆయన తన సెగ్మెంట్ పరిధిలోని భీంగల్మున్సిపాలిటీపైనే దృష్టి పెట్టారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో క్లిష్టపరిస్థితు లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు అడ్రస్‌లేకుండా చేయాలని కవిత వ్యూహంతో పావులు కదుపుతున్నారు. అందుకు సెలెక్టివ్స్థానాల్లో సింహం గుర్తుపై తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు.
