రోడ్ ​డాక్టర్​కు అంబులెన్స్ ​ఇచ్చిన్రు

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్, వెలుగు: రోడ్ల మీద గుంత కనపడగానే పూడ్చేసే రోడ్ డాక్టర్ కాట్నం గంగాధర్ తిలక్ దంపతుల సేవలు అభినందనీయమని ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్​మెంట్​ ఫౌండర్ చైర్మన్ డా. ఎస్. ప్రతాప్ రెడ్డి అన్నారు. వారు చేస్తున్న సేవలకు వెహికల్ బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చానని, అందుకే తమ కాలేజ్ తరఫున అంబులెన్స్ ను డొనేట్ చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మేడ్చల్ లోని ధృవ కాలేజ్ ఆవరణలో అంబులెన్స్ తాళాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ డాక్టర్ గంగాధర్ తిలక్ లాంటి ఫ్రెండ్​తనకు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో గంగాధర్ తిలక్ దంపతులు, కొడుకు పాల్గొన్నారు. 

Tagged Ambulance, Donation,

Latest Videos

Subscribe Now

More News