26/11 మాస్టర్ మైండ్స్ ను చట్టం ముందుకు తీసుకురావాలి : ప్రవాస భారతీయులు

26/11 మాస్టర్ మైండ్స్ ను చట్టం ముందుకు తీసుకురావాలి :  ప్రవాస భారతీయులు

న్యూయార్క్, టోక్యో: అమెరికా, జపాన్ దేశాల్లోని పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన నిర్వహించారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఉగ్ర దాడులకు కారణమైన మాస్టర్ మైండ్స్ ను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

న్యూయార్క్ లోని పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట నిరసన చేపట్టారు. పాక్ కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించి నిరసన నినాదాలు చేశారు. అలాగే హ్యూస్టన్ చికాగో నగరాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. అటు న్యూజెర్సీలోని పాకిస్తాన్ కమ్యూనిటీ సెంటర్ ముందు కూడా ప్రవాస భారతీయులు ఆందోళన నిర్వహించారు. 

జపాన్ రాజధాని నగరమైన టోక్యో లోని పాకిస్తాన్ ఎంబసీ ముందు కూడా ప్రవాస భారతీయులు నిరసనకు దిగారు. ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్స్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు.  ఉగ్రదాడుల్లో చనిపోయిన వారికి నివాళులర్పించారు.