యూపీలో కాంగ్రెస్ సభలు, సమావేశాలు రద్దు

యూపీలో కాంగ్రెస్ సభలు, సమావేశాలు రద్దు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే  కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ  నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సభలు సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిచింది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ కాంగ్రెస్ కమిటీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుశీల్ చంద్రకు లేఖ రాసింది. లడ్కీ హన్ లడ్ శక్తి హన్ మారథాన్ లతోపాటు జనవరి 15న లక్నోలో పార్టీ నిర్వహించాల్సిన మెగా ర్యాలీ కూడా వాయిదా వేసినట్లు తెలిపింది.  అంతేకాదు.. రాబోయే రోజుల్లో నోయిడా, వారణాసి తోపాటు రాష్ట్రాలలోని అనేక ఇతర జిల్లాల్లో ప్లాన్ చేసిన 8 మారథాన్‌లను రద్దు చేసినట్లు చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

కాంట్రాక్ట్ కార్మికులను కేసీఆర్ ఎందుకు పర్మినెంట్ చేయలే