IPL 2026: కేకేఆర్‎కు బిగ్ షాక్.. డూ ఆర్ డై మ్యాచ్‎ వేళ స్టార్ ప్లేయర్ ఔట్

IPL 2026: కేకేఆర్‎కు బిగ్ షాక్.. డూ ఆర్ డై మ్యాచ్‎ వేళ స్టార్ ప్లేయర్ ఔట్

కోల్‎కతా: ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ వేళ కేకేఆర్‎కు బిగ్ షాక్ తగిలింది. నాకౌట్‎కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‏కు ముందు ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్‎క్రిష్ రఘువంశీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని కేకేఆర్ మేనేజ్మెంట్ అధికారికంగా ధృవీకరించింది. లీగ్ దశలో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‎లో రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. 

గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీతో కేకేఆర్ తలపడనున్న చివరి లీగ్ మ్యాచ్‎కు రఘువంశీ దూరమయ్యాడు. ఈ సీజన్‎లో కేకేఆర్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన రఘువంశీ డూ ఆర్ డై మ్యాచ్ వేళ దూరం కావడం కోల్‎కతాకు భారీ ఎదురు దెబ్బే. 

కేకేఆర్ ప్లే ఆఫ్స్ సినారియో

కేకేఆర్ ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 13 లీగ్ మ్యాచులు ఆడింది. ఇందులో ఆరు విజయాలు, ఆరు ఓటములు చవిచూసింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మొత్తం 13 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‎లో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీతో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‎లో తప్పక విజయం సాధించాలి.

Also Read : ఓటమి బాధలో ఉండగా మళ్లీ ఇదో దెబ్బ

 ఢిల్లీపై గెలిచినప్పటికీ.. పంజాబ్, రాజస్థాన్ తమ తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవాలి. ఒకవేళ రాజస్థాన్ తమ చివరి మ్యాచులో గెలిస్తే కేకేఆర్ నేరుగా ఇంటి దారి పట్టాల్సిందే. ఒకవేళ రాజస్థాన్ తమ లాస్ట్ మ్యాచులో ఓటమి పాలై.. కేకేఆర్, పంజాబ్ తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం కానుంది.