చెన్నై: ఐపీఎల్ 19లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమి చవిచూసి ఇంటిబాట పట్టింది. దీంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న సీఎస్కే కెప్టెన్, ప్లేయర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో బిగ్ షాక్ ఇచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ (నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయకపోవడం) కారణంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.24 లక్షలు, ఆ జట్టు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ. 6 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఓవర్-రేట్ నిబంధనలను సీఎస్‌కే ఉల్లంఘించడం ఇది రెండోసారి. ఐపీఎల్ నియామవళి ప్రకారం.. మొదటి తప్పుకు జట్టు సభ్యులకు ఎలాంటి జరిమానా ఉండదు.
ఓన్లీ టీమ్ కెప్టెన్‌కు మాత్రమే రూ.12 లక్షల ఫైన్ విధిస్తారు. కానీ ఒకే సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేటింగ్‌కు పాల్పడితే కెప్టెన్‌తో పాటు జట్టులో మిగిలిన 10 మంది ఆటగాళ్లకు జరిమానా విధిస్తారు. ఈ సీజన్లో చెన్నై రెండోసారి స్లో ఓవర్ రేటింగ్‌కు పాల్పడటంతో కెప్టెన్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లకు జరిమానా పడింది. ఇప్పటికే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న చెన్నై కెప్టెన్, ఆటగాళ్లకు జరిమాన పడటంతో మరింత బాధకరం.
ఈ సీజన్లో 14 లీగ్ మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలు సాధించి.. 8 మ్యాచుల్లో ఓటమి పాలైంది. 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ లో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ALSO READ : ఆర్సీబీతో పోరు.. హైదరాబాద్ టాప్ 2 చేరడం సాధ్యమే..
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంచనాల మేర రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ప్రభావం జట్టు విజయావకాశాలపై తీవ్రంగా పడింది. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన యంగ్ ప్లేయర్స్ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయారు. ఇన్ఫామ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలగడం కూడా చెన్నైను దెబ్బకొట్టింది.
