IPL 2026: ఆర్సీబీతో పోరు.. హైదరాబాద్ టాప్ 2 చేరడం సాధ్యమే.. కానీ ఇలా జరగాల్సిందే..!

IPL 2026: ఆర్సీబీతో పోరు.. హైదరాబాద్ టాప్ 2 చేరడం సాధ్యమే.. కానీ ఇలా జరగాల్సిందే..!

హైదరాబాద్: ఐపీఎల్ 19 లీగ్ దశలో భాగంగా శుక్రవారం (మే 22) మరో రసవత్తర పోరు జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‎కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‎హెచ్) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‎లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఇదిలా ఉంటే.. లీగ్‎లో ఇప్పటి వరకు ఆర్‌సీబీ తొమ్మిది విజయాలు, నాలుగు ఓటములతో 18 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో ఉంది. 

ఎస్‌ఆర్‌హెచ్ ఎనిమిది విజయాలు, ఐదు ఓటములతో 16 పాయింట్లలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ 1.065 ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్ నెట్ రన్ రేట్ 0.35గా ఉంది. అయితే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం థర్డ్ ప్లేస్‎లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ టాప్ 2లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది.

 ఇలా జరగాలంటే ఆర్సీబీపై అత్యంత భారీ పరుగుల తేడాతో లేదా అతి తక్కువ ఓవర్లలోనే హైదరాబాద్ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ ప్రకారం గెలిస్తేనే హైదరాబాద్ టాప్ 2లో చోటు దక్కించుకుంటుంది. లేదంటే మూడో స్థానానికి పరిమితమై ఎలిమినేటర్ 1 మ్యా్చ్ ఆడనుంది. మరీ హైదరాబాద్ టాప్ 2 చేరుకోవాలంటే ఉన్న సమీకరణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

Also Read : ఉప్పల్లో RCBvsSRH మ్యాచ్.. ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉందంటే

SRH  ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పరిస్థితి ఇది..

ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 200 నుంచి 220 పరుగులు చేస్తే.. అప్పుడు RCBని కేవలం 110-130 పరుగుల లోపే కట్టడి చేయాలి. ఇలా చేయడం వల్ల సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ సుమారు +0.650కి పెరుగుతుంది. ఓడిపోయిన ఆర్సీబీ రన్ రన్ రేట్ +1.065 నుండి +0.640కి పడిపోతుంది. దీనితో హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంటుంది. 

ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే పరిస్థితి ఇది

ఎస్ఆర్‎హెచ్‎తో జరగనున్న మ్యాచులో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేస్తే.. సన్‌రైజర్స్ ఆ లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోపు ఛేజ్ చేయాల్సి ఉంటుంది. వికెట్లు పడినా సంబంధం లేకుండా పవర్‌ప్లేలోనే విధ్వంసకర బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. లెక్కల ప్రకారం హైదరాబాద్‎కు టాప్-2 చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్‌గా మాత్రం ప్రస్తుతం భీకర ఫామ్‎లో ఆర్సీబీని ఇంతటి భారీ తేడాతో ఓడించడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.