
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ ఖమ్మం కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, డీఆర్వో ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఇతర జిల్లా అధికారులు, సంఘాల నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.