AP News: నెల్లూరు జైలునుంచి మాజీమంత్రి కాకాణి విడుదల.. సర్వేపల్లి ప్రజలే నా ఆస్తి

AP News:  నెల్లూరు జైలునుంచి మాజీమంత్రి కాకాణి విడుదల.. సర్వేపల్లి ప్రజలే నా ఆస్తి

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్​  ఈ రోజు ఉదయం ( ఆగస్టు 20)  నెల్లూరు సెంట్రల్​ జైలు నుంచి విడుదలయ్యారు.  పలు షరతులతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది.  రుస్తుం మైనింగ్ తో పాటు వివిధ కేసుల్లో  86 రోజులు  కాకాణి పాటు జైల్లో ఉన్నారు. ఆయనకు స్వాగతంపలకడానికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా  సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే తన ఆస్తి అని.. హైకోర్టు షరతుల దృష్ట్యా కేసుల గురించి మాట్లాడటం లేదన్నారు.  జడ్పీ చైర్మన్​ గా... రెండు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేసిన నన్ను చాలా రోజులు జైల్లో పెట్టారన్నారు. 

మంగళవారమే ( ఆగస్టు 19)  జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.. అది  ఎందుకో వాయిదా పడింది. విడుదల వాయిదా పడటంతో మరో కేసు ఉంటుందేమోనని అనుకున్నా. నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు.  ఇప్పటికి ఏడు పీటీ వారెంట్ లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

►ALSO READ | తిరుపతి: పోలీసింగ్ విజిబుల్ ప్రోగ్రాం.. పలు సర్కిళ్లలో ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు 

కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవు.. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుందని  మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి  అన్నారు. తాను ఎక్కడ ఉన్నా.. పోరాటం ఆగదన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారంటూ.. తాను తప్పు చెయ్యలేదు, బెయిల్ ఇవ్వమని కోరాను తప్పా..   ఆరోగ్యం బాగాలేదని..  ఎప్పుడు బెయిల్ అడగలేదన్నారు. జైల్లో మొత్తం వైస్సార్సీపీ నేతలే ఉన్నారని  దైర్యంగా పోరాడతామని  కాకాణి స్పష్టం చేశారు.