యాపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు

యాపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు
  • ఐఫోన్​లకు థ్రెట్ అలర్ట్ లపై వివరణ ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు ఇచ్చింది. ఐఫోన్​లకు పంపిన థ్రెట్ అలర్ట్​లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఐఫోన్లకు థ్రెట్ అలర్ట్ వచ్చింది. దీంతో ఇది కేంద్ర ప్రభుత్వ పనేనని మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, రాఘవ్ చద్దా, శశిథరూర్, పవన్ ఖేరా, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు ఆరోపించారు.

ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు నిర్ధారించేందుకు ఉన్న ఆధారాలను సమర్పించాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ కంపెనీకి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై ఆన్ లైన్ సేఫ్టీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్  టీమ్ విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.