
సోషల్ మీడియా ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ఫాలోవర్స్, లైక్స్, షేర్ లను సంపాదించేందుకు కంటెంట్ క్రియేటర్స్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ కంటెంట్ వైరల్ అయ్యేందుకు దారుణంగా వింత ప్రయోగాలు చేస్తున్నారు.వీటిలో కొన్ని క్రిటయేర్లకు ప్రమాదాలు తెచ్చిపెడుతుంటే..మరి కొన్ని జనజీవనానికి అడ్డంకిగా మారుతున్నాయి. జర్మన్ కు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ కూడా రీల్స్ చేస్తూ, తన ప్రతిభనుచాటుకునే క్రమంలో వీధుల్లో నానా రభస చేశాడు. పోలీసులు ఊరుకుంటారా.. ఆ యూట్యూబర్ ను ఏం చేశారో చూడండి..
బెంగళూరు ప్రముఖ జర్మన్ టిక్ టాకర్ నోయెల్ రాబిన్సన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ చట్టాలను ఉల్లంఘించి నడిరోడ్డుపై చేసిన పనికి అతనితోపాటు మరో యూట్యూబర్ ను బంధించారు. ఎప్పుడూ రద్దీగా ఉంటే బెంగళూరు వీధుల్లో వీరు చేసిన దానికి పోలీసులు ఫైన్ కూడా వేశారు.
రాబిన్సన్ ,మరో యూట్యూబర్ కలిసి బెంగళూరు వీధుల్లో డ్యాన్సులు చేశారు.. రాబిన్సన్ డ్యాన్స్ చూసేందుకు జనం బాగా గుమికూడారు..దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇండియన్ పంచకట్టులో ఉన్న రాబిన్సన్ డ్యాన్స్ అదరగొట్టాడు. చూసేవారిని బాగా ఆకట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. నడిరోడ్డుపై ఈ ప్రదర్శనలు ఏంటీ బాబూ అంటూ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేసి రాబిన్సన్ ను అతని ఫ్రెండ్ ను కార్లో ఎక్కించారు. ఓ అర్థగంట తర్వాత కొద్దిపాటి ఫైన్ వేసి వారిని విడిచిపెట్టారు.
►ALSO READ | మధ్యతరగతి అనే మైండ్‌సెట్‌లోనే భారతీయులు : డబ్బు సంపాదించినా అవే జ్ఞాపకాల్లో..!
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రాబిన్సన్ తన ఇన్ స్టా గ్రామ్ బ్లాగ్ లో బుధవారం(జూలై30) షేర్ చేశారు. నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఇదే మొదటిసారి..నన్ను జైలుకు పంపుతారని భయపడ్డాను కానీ అదృష్టవశాత్తూ అంతా బాగానే ఉంది.నేను సురక్షితంగా ఉన్నాను.నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అని పోస్ట్ చేసిన వీడియోకు రాబిన్స్ క్యాప్షన్ ఇచ్చారు.
రాబిన్సన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్లకు పైగా కంటెంట్ క్రియేటర్. అతని డ్యాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. అతని డ్యాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌లో చాలా ఫేమస్ అయ్యాయి. ఇటీవల ఇండియా టూర్ వచ్చిన రాబిన్సన్ ఎలాంటి పర్మిషన్ లేకుండా బెంగళూరు వీధుల్లో డ్యాన్స్ ప్రదర్శన చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయలేదుగానీ.. రెండు డాలర్ల జరిమానాతో తర్వాత విడుదల చేయడంతో రాబిన్సన్ సంతోషం వ్యక్తం చేశారు.