
మధ్యతరగతి జీవితం అనేది డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అదొక జ్ఞాపకం. 1990కి ముందు పుట్టిన ప్రజలు ఎక్కువగా తమను తాము మధ్యతరగతికి చెందిన వారిగా భావిస్తుంటారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరగటాన్ని ఒక గౌరవంగా భావిస్తుంటారు. చాలా మంది కుటుంబాలు ప్రస్తుతం సంపన్నులుగా మారినప్పటికీ వారి జ్ఞాపకాలు మాత్రం ఇంకా మధ్యతరగతి అనే ఆలోచనలోనే మిగిలిపోయాయి.
మధ్యతరగతిలో పుట్టినవారికి కోరుకున్నవి వెంటనే దొరికేవి కావు. కావాల్సి వాటి కోసం కొంత పోరాయం, చిన్న విజయాలను తీపి జ్ఞాపకాలుగా మార్చుకోవటం చాలా మందికి అలవాటు. చిన్నప్పటి నుంచి ముఖ్యమైనవాటికే ప్రాధాన్యత ఇస్తూ.. అవసరాలు మినహా డబ్బును దాచుకోవటం, అద్దెలు సైకిల్ తీసుకుని నడపటం, ఇంట్లో అమ్మ ఇచ్చే రూపాయి లేదా రెండు రూపాయలతో స్కూల్లో కొనుక్కోవటం ఇలా ప్రతిదీ ఒక తీపి జ్ఞాపకమే. కొనే ఒక్క వస్తువైనా బేరాలాడటం, పాడైన వస్తువులు బాగుచేసుకుని మరీ వాడుకోవటం ఇలా డబ్బులతో సంబంధం లేని ఎన్నో జ్ఞాపకాల నియమే మధ్యతరగతి బాల్యం.
దశాబ్ధాల తర్వాత జీవితంలో సక్సెస్ చూసి, వ్యాపారవేత్తలుగా ఆస్తులు కూడబెట్టినప్పటికీ చాలా మంది తమను తాము మధ్యతరగతి జ్ఞాపకాల్లోనే ఉంచుకుంటుంటారు. తమను తాము మధ్యతరగతి వ్యక్తులుగానే పరిగణిస్తుంటారు. వారి పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వటానికి గ్లోబలైజేషన్, మంచి కెరీర్, విద్య దోహదపడ్డాయి. ఈరోజుల్లో విమాన ప్రయాణాల నుంచి లగ్జరీ ట్రిప్స్ వరకు అన్నీ సర్వసాధారణంగా మారినప్పటికీ చాలా మంది తమ పిల్లలకు తమ అలవాట్లను పాసాన్ చేస్తున్నారు.
అయితే ఇదే మైండ్ సెట్ చూపటం తర్వాతి తరాల వారికి ఇబ్బందికరంగా ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే మధ్యతరగతి జీవితం ఏ పాఠాల పుస్తకంలో చూపించని నేర్పని విషాయాలను నేర్పిస్తుంది. అయితే అవసరాలకు కోరికలకు మధ్య చిన్న గీతను ఇది ఏర్పరచి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే క్లారిటీని ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు.