న్యాయం జరగనందుకే ఉద్యోగుల్లో  తీవ్ర అసంతృప్తి

న్యాయం జరగనందుకే ఉద్యోగుల్లో  తీవ్ర అసంతృప్తి
  •  ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛనుదారులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కానందువల్లే వారిలో  తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి  డిమాండ్ చేశారు. ఫిట్మెంట్ లో మార్పులు లేకపోవడం, సి పి ఎస్ రద్దు నిర్ణయం ప్రకటించకపోవడం, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వకపోవడం , కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత లేకపోవడం, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల పే స్కేల్స్ అక్టోబర్ నుండి పొందలేకపోవడం,  హెచ్ ఆర్ ఎ శ్లాబులు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యధాతధంగా కొనసాగించక పోవడం తదితర డిమాండ్లు పరిష్కారం కానందుకే  అయా వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.

 9 ,10 పిఆర్సి లలో కమిటీ  చేసిన సిఫారసులు తోపాటు చేయని  డిమాండ్ లు కూడా కొన్ని సాధించుకుంటే ప్రస్తుతం ఉన్న సౌలభ్యాలు పోగొట్టుకోవడం వల్లనే ఆయా వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 13 లక్షల మంది సమస్యలపై ఉద్యోగ సంఘ నాయకులతో నేరుగా ముఖ్యమంత్రి గారు చర్చించకపోవడం   సరికాదన్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు.