వరదల్లో తిరుగుతున్న అసోం సీఎం

వరదల్లో తిరుగుతున్న అసోం సీఎం

అసోంలొ నాగవ్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 134కి చేరింది. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.  వారం రోజుల పై నుంచే వరద గుప్పిట్లో  ఉంది అసోం. ఈ క్రమంలో వరద పరిస్థితి తెలుసుకొనేందుకు స్వయంగా రంగంలోకి దిగారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa). క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద నీటిలో తిరుగుతూ వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు.

వరద నీటిలో తిరుగుతున్న సీఎంను కలిసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఆయనకు అసోం సంప్రదాయ కండువాను ఓ మహిళ అందచేసింది. మరోవైపు...వరద బాధిత ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వమే రిలీఫ్ మెటీరియల్ అందిస్తుందన్నారు నాగవ్ డిప్యూటీ కమిషనర్ నిసర్గ్ హివారే తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే వాటికి ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ప్రజలకు 3 రోజులకు సరిపడ నిత్యావసరాలు పంపామన్నారు. మరో ఐదు రోజులకు సరిపడ సామాగ్రి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైన డబ్బులు చెల్లించాలని అడిగితే తమకు తెలియజేయాలన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు నిసర్గ్ హివారే.