నేటి (ఆగస్టు 23 ) అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘాల సమ్మె

నేటి (ఆగస్టు 23 ) అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘాల సమ్మె

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్​సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె​నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోసియేషన్ కూడా మద్దతు తెలపడంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులకు రవాణా ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

ఈ మేరకు హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీఎమ్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో సంఘాల జేఏసీ నేతలు ఎ.సత్తిరెడ్డి, బి. వెంకటేశ్, రవిశంకర్, వి.మారయ్య తదితరులు మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దిగి వచ్చేదాకా తమ సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్​పార్టీ ఆటోడ్రైవర్లు, క్యాబ్, రవాణా రంగంలో పని చేస్తున్న వారికి పలు హామీలను ఇచ్చిందని..అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు రవాణా మంత్రికి, ఆర్టీఏ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేకనే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పూనుకున్నట్టు తెలిపారు.