వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడంటూ..

వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడంటూ..
  • ఆస్పత్రి వద్ద తల్లిదండ్రుల ఆందోళన
  • ఆక్సిజన్ అందక 4 నెలల పసికందు మృతి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  కొత్తగూడెంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక 4 నెలల పసికందు చనిపోయిందని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో పాపను హాస్పిటల్ లో చేర్పించామన్నారు. ఇవాళ ఉదయం కరెంట్ పోవడంతో చిన్నారికి ఆక్సిజన్ అందలేదన్నారు. కరెంట్ పోయిన వెంటనే సిబ్బంది జనరేటర్ ఆన్ చేయలేదని చెబుతున్నారు పేరెంట్స్. అరగంట తర్వాత జనరేటర్ ఆన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.