చెన్నూరులో బాల్కసుమన్ ను ఓడిస్తాం: ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్

చెన్నూరులో బాల్కసుమన్ ను ఓడిస్తాం: ఓయూ జేఏసీ నేత  మహిపాల్ యాదవ్

చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. బాల్క సుమన్ దుర్మార్గుడని ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్ అన్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులతో పెట్టుకున్నారంటూ ,,, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామన్నారు.  చెన్నూరులో బాల్క సుమన్  రాజకీయ స్వార్ధం  కోసం చెరువులో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారన్నారు.  చెన్నూరులో    పేదల కోసం కట్టించిన ఇళ్లల్లో   బాల్క సుమన్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఉంటారా అని ప్రశ్నించారు. 

బాల్క సుమన్, కేసీఆర్ లు స్పైడర్ సినిమాలో విలన్ లాంటి వాళ్ళని ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్ అన్నారు.  నిరుద్యోగులు చనిపోతే  బాల్క సుమన్ కు కేసీఆర్ కు సంతోషం కలుగుతుందన్నారు.  కేసీఆర్ ను ఓడించడానికి తాను లక్ష రూపాయిలైనా అప్పు చేస్తానన్నారు.   మీరు రూ. 5 వేలు అప్పు చేసైనా చెన్నూరులో బాల్క సుమన్ ను ఓడించాలన్నారు.   విద్యార్థులు , నిరుద్యోగులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదని  ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్ అన్నారు .