అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైడ్రా మినహాయింపు ఎందుకు? : బండి సంజయ్

అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైడ్రా మినహాయింపు ఎందుకు? : బండి సంజయ్
  • రాష్ట్రంలో పేదల జీవితాలకు విలువలేదా?: బండి సంజయ్
  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుటుంబాన్ని సీఎం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఫైర్

జగిత్యాల, వెలుగు: పాతబస్తీలో అక్రమ నిర్మాణాల పేరుతో పేదల గుడిసెలు కూల్చేస్తున్న హైడ్రా.. అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. “అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని అంటున్నారు.. మరి పేదల జీవితాలు విలువలేనివా?” అంటూ ఆయన ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో రూ.291 కోట్ల సీఆర్ఐఎఫ్ నిధులతో 1,341 కిలో మీటర్ల రహదారులు, రూ.650 కోట్ల ఉపాధి హామీ పనులు, ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ఎంపీ ప్రారంభించారు.

 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హీరోను చేసిన పేపర్, టీవీలే ఇప్పుడు తప్పులు ఎత్తిచూపితే తెలంగాణ వ్యతిరేక మీడియా అంటూ దాడులు చేయడం దుర్మార్గం” అని ఆయన విమర్శించారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో తనను, డ్రోన్ ఎగరేశారనే సాకుతో రేవంత్​రెడ్డిని జైల్లో వేసిన విషయాన్ని  సీఎం అప్పుడే మర్చిపోయారా? అని నిలదీశారు. లక్ష కోట్ల కాళేశ్వరం స్కాం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా, డ్రగ్స్, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్, గొర్రెల స్కాం, విద్యుత్ కొనుగోళ్ల కేసుల్లో కేసీఆర్ కుటుంబం పాత్రపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. "కాంగ్రెస్ పాలనలో కూడా చట్టం కేసీఆర్ చుట్టం అయింది. మీడియా సంస్థలపై దాడులు చేస్తే మేము చూస్తూ ఉండం" అని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.