సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

నిజామాబాద్ రూరల్, వెలుగు : గిరిజనుల ఆరాద్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆల్‌‌‌‌ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు కోరారు. శనివారం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.  బంజారాల అభ్యున్నతికి సేవాలాల్​ మహరాజ్​ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

దేశంలో 15 కోట్లకుపైగా గిరిజనులు ఆయనను పూజిస్తున్నారన్నారు. సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ ​చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జలందర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నరేశ్, జిల్లా యువజన అధ్యక్షుడు ఇందల్, హోమ్ సింగ్, జోర్ సింగ్, గౌతమ్ పాల్గొన్నారు.