15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకంటే?

15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకంటే?

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ లో బ్యాంకులకు దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.. ఏప్రిల్ లో రెండో శనివారం, ఆదివారాలు, సెలవులు, పండుగలు కలిపి మొత్తం  15 రోజులు హాలీడేస్ వచ్చాయి.  ఏ రోజు బ్యాంకులకు హాలిడే.. ఏ రోజుల్లో పనిచేస్తాయో తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే బ్యాంక్ దగ్గరకు వెళ్లాక బ్యాంకులు క్లోజ్ ఉంటే మీ టైం వేస్ట్. ఒక్కసారి ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులు, ఎందుకో  తెలుసుకుందాం..

హాలిడేస్ లో  బ్యాంకు శాఖలు మూతపడినప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్,  ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు యథావిధిగా పని చేస్తాయి.  అలాగే బ్యాంకు ఖాతాదారులు ఆన్ లైన్ ద్వారా లావాదేవీలను యధావిధిగా జరుపుకోవచ్చు.

 ఏప్రిల్ లో బ్యాంక్ ల సెలవుల లిస్ట్

ఏప్రిల్ 1  అన్ని కమర్షియల్, కో ఆపరేటివ్ బ్యాంకుల వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ డే
 ఏప్రిల్ 2  ఆదివారం 
ఏప్రిల్ 4 - మహావీర్ జయంతి 
ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 7 - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 8  రెండో శనివారం
ఏప్రిల్  9 ఆదివారం
ఏప్రిల్ 14   అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 15  పలు ప్రాంతాల్లో ప్రాంతీయ పండుగలు
ఏప్రిల్ 16 ఆదివారం
ఏప్రిల్ 18   షబ్- ఎల్ -ఖదర్  కారణంగా
ఏప్రిల్ 21  రంజాన్
ఏప్రిల్ 22  నాలుగో శనివారం
ఏప్రిల్ 23  ఆదివారం
ఏప్రిల్ 30  ఆదివారం