V6 News

సామాజిక సేవకురాలికి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం

సామాజిక సేవకురాలికి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన సామాజిక సేవకురాలు బత్తుల సరిత అత్యంత ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ​ఎక్స్​లెన్స్​ పురస్కారం’ అందుకున్నారు. ఈ నెల 8న న్యూఢిల్లీలో తెలంగాణ సాంస్కృతిక సాహిత సేవా ట్రస్ట్ ​ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు.

సామాజిక సేవా రంగంలో సరిత చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును అందించినట్లు ట్రస్ట్​ నిర్వాహకులు డాక్టర్ మాచవరం​గౌరీ తెలిపారు. గ్లోబల్​ ఎక్స్​లెన్స్​ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందని, మహిళారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అవార్డు గ్రహీత సరిత పేర్కొన్నారు.