నేను మాట్లాడితే బయట తిరగలేరు : బీర్ల ఐలయ్య

నేను మాట్లాడితే బయట తిరగలేరు : బీర్ల ఐలయ్య
  •  ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ‘నేను మాట్లాడితే చిల్లర నాయకులు ఒక్కరోజు కూడా బయట తిరగలేరు’ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆలేరులో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ లీడర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధిని తాను చేసి చూపిస్తుంటే కావాలని శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

 వాళ్ల పాలేర్లతో మాట్లాడిస్తూ తనపై బురద జల్లే  ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీ వ్యక్తిగత చరిత్ర బయటపెడితే ఒక్క రోజు కూడా బతకలేరని, వందసార్లు ఉరి వేసుకుంటారని ప్రతిపక్ష లీడర్లను ఉద్దేశించి కామెంట్స్​చేశారు. ధైర్యముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన సవాల్ విసిరారు.