
ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంటెర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఓటీటీలు రీప్లేస్ చేస్తున్నాయి. కేవలం సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్ లకు సైతం ఆడియన్స్ బాగా అడిక్ట్ అయ్యారు. అందులోనూ క్రైమ్, థ్రిల్లర్, హారర్ సిరీస్ లవైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు ప్రేక్షకులు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు, సిరీస్ లు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.
ఇపుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో భక్షక్(Bhakshak) మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
భక్షక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు మేకర్స్. ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు..భక్షక్‌లు అవుతారు అనే సందేశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ALSO READ :- హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు : జగ్గారెడ్డి
భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను పులకిత్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు.