ఆస్పత్రికి వచ్చాడు.. తుపాకీతో కాల్చాడు.. క్షణాల్లోనే అత్యంత దారుణం

ఆస్పత్రికి వచ్చాడు.. తుపాకీతో కాల్చాడు.. క్షణాల్లోనే అత్యంత దారుణం

బీహార్లో భయాందోళనకు గురి చేసే ఓ సంఘటన చోటు చేసుకుంది. అర్రా నగరంలోని ఓ ఆసుపత్రిలో కాల్పుల ఘటన జరిగింది. ఓ దుండగులు  ఆసుపత్రిలోకి వచ్చి.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  వివరాల్లోకి వెళ్తే..

అర్రా సిటీలోని దరాహ్రా ప్రాంతంలో ఉన్న  ఓ ప్రైవేటు ఆసుపత్రికి గర్భవతి అయిన తన భార్యను  డెలివరీ కోసం తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఆసుపత్రి జనరల్ వార్డులో ఉన్న ఆ వ్యక్తిపై ఓ దుండగుడు కాల్పులు జరిపి పారిపోయాడు.  ఈ దృశ్యాలు స్థానిక ఆసుపత్రిలోని సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. 

43 సెకన్ల వీడియోలో  ఓ బాలుడు సహా ముగ్గురు ఉన్నారు. ఇందులో   డ్ పై ఓ వ్యక్తి కూర్చోగా..బెడ్ కు ఆనుకుని ఓ బాలుడు నిలబడ్డారు. పక్కనే మరో బెడ్ పై మరో వ్యక్తి కూర్చున్నాడు. బాలుడు నీళ్లు తాగి లోపలికి వెళ్తండగా..డోర్ లో నుంచి ఓ వ్యక్తి హడావుడికి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. అతను కుడివైపునకు ఉన్న డోర్ లోకి వెళ్తే ప్రయత్నం చేస్తాడు. వెంటనే వెనక్కు తిరిగి..రెండో బెడ్ పై కూర్చున్న వ్యక్తిపై కాల్పులు జరుపుతాడు. ఈ ఘటనలో బాధితుడకి తీవ్ర గాయాలయ్యాయి. ఆతనికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు...ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.