బీహార్ లో అమ్మ రాజకీయం : AI వీడియోతో రచ్చ రచ్చ..

బీహార్ లో అమ్మ రాజకీయం : AI వీడియోతో రచ్చ రచ్చ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు ఎదో, ఫేక్ ఏదో తెలియకుండా అయిపోతుంది. కొన్నిసార్లు అబద్దం నిజంగా, నిజం అబద్దంలా కనిపిస్తుంది. ఇక పొలిటికల్ పార్టీలు AIతో తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అతని తల్లి హీరాబెన్ మోడీ లాంటి పాత్రలతో.. బీహార్ కాంగ్రెస్ అఫిషియల్ గానే రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై బీహార్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటలు యుద్ధానికి దిగాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకుందామా..

ప్రధాని మోడీ పోలికతలో ఉన్న పాత్ర రాత్రి పడుకునే ముందు ఈ రోజు ఓటు చోరీ విజయవంతంగా కంప్లీట్ చేశాం.. ఇప్పుడు హాయిగా నిద్రపోదాం అని చెబుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత మోడీ తల్లి పోలికతో ఉన్న పాత్ర.. ప్రధాని పాత్రలో ఉన్న మోడీ కలలోకి వస్తుంది. ఓట్ల కోసం తన పేరును ఉపయోగించినందుకు తిడుతున్నట్లు ఉంటుంది. ఓట్ల కోసం రాజకీయాల్లో ఎంత తగ్గటానికి అయినా సిద్ధంగా ఉన్నావా.. నోట్ల రద్దుతో క్యూలో నిల్చోపెట్టావు అంటూ తిడుతుంది., ఆ వెంటనే మోదీ పాత్రధారికి మెలకువ వస్తుంది. 

ALSO READ : దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించా

ఈ AI వీడియోకు  "సాహెబ్ కలలోకి అమ్మ వచ్చింది చూడండీ అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ తన అఫిషియల్ X అకౌంట్ లో షేర్ చేసింది బీహార్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైరల్ అయ్యింది. 3 మిలియన్ వ్యూస్ రావటంతో.. బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ అన్ని పరిధులు దాటింది.. మోడీ తల్లిని కించపరుస్తుంది.. చనిపోయిన వాళ్లను అవమానిస్తుంది అంటూ బీహార్ బీజేపీ ఆగ్రహం చేసింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఉన్నమాటే అన్నాం.. ఇందులో కించపరిచే విధంగా ఏముందీ అంటూ గట్టిగానే చెబుతోంది. మోడీ తల్లిని అవమానించినట్లు ఎక్కడ ఉందో చెప్పాలని.. తప్పు చేసిన కొడుక్కి తల్లి బుద్ధి  చెప్పటం కూడా తప్పేనా అంటూ సుతిమెత్తగా బీజేపీకి చురకలు అంటిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 

మరికొన్ని నెలల్లో బీహార్ ఎన్నికలు జరుగనుండటంతో.. రాజకీయాల్లో వేడెక్కాయి. ప్రచారం ఉధృతం చేశాయి పార్టీలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో రిలీజ్ చేసింది. వైరల్ అయ్యింది.