జీడిమెట్ల, వెలుగు: సూరారం లక్ష్మీనగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు వారాల మహేశ్‌కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం ఆయన కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్ల సమస్య గురించి స్థానికులతో కలిసి విద్యుత్ ఏఈ సాయికుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని నెలలుగా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఇబ్బంది పెడుతోందని, పలు వీధుల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయని చెప్పారు.
