కనువిందు చేస్తున్న బొగత జలపాతం

కనువిందు చేస్తున్న బొగత జలపాతం

ములుగు జిల్లా: వాజేడు మండల పరిధిలో చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం  పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీరు ఉధృతంగా చేరుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు నీరు లేక కళ తప్పిన ఈ జలపాతం ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుంది. జల సవ్వడులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటాకులు తరలి వస్తున్నారు. తెలంగాణ నయాగరగా గుర్తిపు పొందిన బొగత జలపాతం సోయగాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.