బీసీసీఐ సమాన వేతన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాలీవుడ్

బీసీసీఐ సమాన వేతన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాలీవుడ్

పురుషక్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును  చెల్లిస్తామని బీసీసీఐ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మెన్స్ క్రికెటర్లకు చెల్లించే ఫీజునే ఉమెన్స్కు చెల్లిస్తామని చెప్పిన బీసీసీఐపై ప్రశంసల  వర్షం కురుస్తోంది.  బీసీసీఐ నిర్ణయాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు స్వాగతించారు. భారత క్రికెట్ లో ఇదొక మైలురాయి నిర్ణయమని కొనియాడారు. 

గుడ్ ఫ్రంట్ ఫుట్ షాట్...
బీసీసీఐ నిర్ణయంపై బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. వాటే గుడ్ ఫ్రంట్ ఫుట్ షాట్ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. క్రీడల్లో అందరిని సమానంగా చూడాలని బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని దేశంలోని ఇతర రంగాల్లోనూ అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. 

అద్భుతమైన నిర్ణయం..
బీసీసీఐ నిర్ణయంపై అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. బీసీసీఐ నిర్ణయం తన మనసుకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పాడు. ఇది అద్భుతమైన నిర్ణయమని కొనియాడాడు. ఈ నిర్ణయం వల్ల మహిళలు  క్రికెట్ ను ఎంచుకునేందుకు దోహదపడుతుందని ట్వీట్ చేశాడు. 

గొప్ప ముందడుగు...
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న బీసీసీఐ నిర్ణయం..మహిళా క్రికెట్ లో గొప్ప ముందడుగు అని తాప్సీ పన్ను ప్రశంసించింది. బీసీసీఐకు ధన్యవాదాలు తెలిపింది. మరిన్ని రంగాలకు బీసీసీఐ నిర్ణయం ఆదర్శం కావాలని ఆకాంక్షించింది. 

గ్రేట్ డెసిషన్...
బీసీసీఐ నిర్ణయంపై అనుష్క శర్మ ఆనందం వ్యక్తం చేస్తూ...ఓ వీడియోను షేర్ చేసింది. చప్పట్లు కొట్టే ఎమోజీలతో  బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్ను స్క్రీన్ షాట్ పంచుకుంది. 

సమాన వేతనం...
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును  చెల్లిస్తామని ప్రకటించింది. బీసీసీఐతో కాంట్రాక్టు కుదుర్చుకునే సీనియర్ పురుష క్రికెటర్లతో సమానంగా ఇకపై మహిళా క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫీజును పొందుతారని స్పష్టం చేసింది.  టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ ఫీజు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలను ఇకపై మహిళా క్రికెటర్లు కూడా తీసుకుంటారని వెల్లడించింది.