నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు: నర్సంపేట మున్సిపాలిటీలో గెలుపు మనదేనని బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట టౌన్‌లోని సర్వాపురం 5వ వార్డుకు చెందిన బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ శీలం రాంబాబు మంగళవారం మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 17వ వార్డుకు చెందిన 35 మంది ముస్లీం మైనార్టీ యువకులు బీఆర్ఎస్లో చేరారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పలువురు బీజేపీ లీడర్లు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు
కప్పుకున్నారు.
నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా రవీందర్రావు
బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావును నియమిస్తూ పెద్ది ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మంగళవారం నియామక పత్రాలను రవీందర్‌రావుకు అందజేశారు.
