నీటి ఒప్పందాలపై కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టలేదు : జగదీశ్ రెడ్డి

నీటి ఒప్పందాలపై కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టలేదు : జగదీశ్ రెడ్డి
  • మళ్లీ ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చెప్పుతో కొడతా: జగదీశ్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ఏపీతో జల ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్​ రావు సంతకాలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మళ్లీ అలా మాట్లాడితే చెప్పుతో కొడతానని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి పైలట్లతో పరిచయాలున్నాయి కాబట్టి.. ఆయన వాళ్లను పట్టుకొచ్చి ఎస్ఎల్​బీసీ సర్వేలు చేయిస్తా అంటున్నారు. 

2013లో కాంగ్రెస్​ హయాంలోనే ప్రాజెక్టులవారీగా నీళ్లు కేటాయించారు. అప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఇది అప్పటి మీటింగ్​ మినిట్స్​లోనే ఉంది’’ అని జగదీశ్  చెప్పారు. ఎస్ఎల్​బీసీ కోసం సీఎం రేవంత్​ రెడ్డి, నల్గొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్​ సర్వేలు చేశారని, రాజకీయ నాయకులు టెక్నికల్​ సర్వే చేయడం ఇదే మొదటిసారన్నారు. ఎస్ఎల్​బీసీ విషయంలో కాంగ్రెస్​, టీడీపీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందన్నారు.