మేడిగడ్డ టూర్ కు స్పెషల్ బస్సులు రెడీ

మేడిగడ్డ టూర్ కు స్పెషల్ బస్సులు రెడీ

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గరకు బస్సులు చేరుకున్నాయి. అసెంబ్లీ సమావేశం వాయిదా వేసి 10.15నిమిషాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్ట్ కు వెళ్తారు. ఇప్పటికే అసెంబ్లీ దగ్గరకు మూడు గరుడ బస్సులు వచ్చాయి. భద్రతా సిబ్బంది వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3.30నిమిషాలకు మేడిగడ్డకు చేరుకుంటారు. 

ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. గతంలో ఇలా అసెంబ్లీకి బస్సులు అవిశ్వాస తీర్మాణం సమయాల్లోనే వచ్చేవి. మొదటి సారిగా ప్రాజెక్ట్ సందర్శనకు 3 బస్సుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఇదే రోజు అటు ప్రతి పక్షపార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నల్లగొండలో కృష్ణ జలాల వివాదంపై సభ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వాయిదా వేసి అధికారం పక్షం మేడిగడ్డ, ప్రతిపక్షం నల్లగొండకు వెళ్తున్నాయి.