స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. యువతి మృతి

స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. యువతి మృతి

మేడ్చల్‌లో ఘోరం జరిగింది. దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన అనే యువతి చనిపోయింది. సుమన శ్రీ అనే యువతికి గాయాలయ్యాయి. మృతురాలు గాజులరామారం గ్రామానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బారిన పడిన ఇద్దరు యువతులూ  దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారని చెప్పారు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, మేఘన అనే యువతి అక్కడికక్కడే మరణించిందని తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే టిప్పర్ డ్రైవర్‌‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.