- జిల్లా కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: అంధుల కోసం లిపిని సృష్టించిన లూయిస్ బ్రెయిలీ ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 4న అంధుల మార్గదర్శి లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా 217 వ జయంతిని గురువారం అందుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై లూయిస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంధ విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆఫీసులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ సునంద, డిఇఓ విజయలక్ష్మి, స్కూల్ కార్యదర్శి రంగన్న తదితరులు ఉన్నారు.
ఆటలలో రాణిస్తూ ఫిట్ గా ఉండాలి
గద్వాల, వెలుగు: వివిధ రకాల ఆటలలో రాణిస్తూ పోలీసులు ఫిట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని టెన్త్ బెటాలియన్ లో పోలీసు సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండడం కీలకమన్నారు.
టెన్త్ బెటాలియన్ లో ఇదివరకే గెస్ట్ హౌస్ విస్తరణకు కలెక్టర్ ఫండ్ నుంచి రూ. 10 లక్షలు ఇచ్చామని , ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆటలలో గెలుపొందిన విజేతలకు ట్రోఫీ, మెడల్స్ అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెండ్ లు పాణి, నరేందర్ రెడ్డి, ఏవో తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
