- ఏసీపీ శ్రీరామ్ ఆర్య
కోడేరు, వెలుగు : ప్రతి విద్యార్థి న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏసీపీ శ్రీరామ్ ఆర్య అన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రం హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ... తప్పు చేసి, తనకు తెలియదు అంటే చట్టం ఒప్పుకోదని, తప్పనిసరిగా శిక్ష పడుతుందని అన్నారు.
నేషనల్ లీగల్ సర్వీసెస్ స్కీం, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి అవగాహన కల్పించారు. ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 6 –-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్యా హక్కు ఉందని, వికలాంగులు పట్ల మానవత దృక్పథంతో, గౌరవంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎల్ఎసీ అధికారి, హెడ్మాస్టర్ ఎం.భారతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
