2023 లో అమ్ముడైన కార్లు 41 లక్షలు!

2023 లో అమ్ముడైన కార్లు  41 లక్షలు!
  • రికార్డ్ లెవెల్​లో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు
  • పుంజుకున్న టూవీలర్ సేల్స్‌‌‌‌
  • సెప్టెంబర్ నుంచి పెరిగిన డిమాండ్‌‌‌‌

న్యూఢిల్లీ : కార్ల  కంపెనీలు  2023 లో పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపాయి.  సుమారు 41 లక్షల ప్యాసింజర్ వెహికల్ బండ్లు అమ్ముడయ్యాయని అంచనా. అంతకు ముందు ఏడాదిలో జరిగిన 38 లక్షల బండ్లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ.   సెడాన్, యుటిలిటీ వెహికల్‌‌‌‌ సేల్స్ భారీగా జరిగాయి. ఫెస్టివల్ డిమాండ్‌‌‌‌ బాగుండడంతో అమ్మకాలు పుంజుకున్నాయి.  కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌  నుంచి  డిసెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు బండ్లకు ఫుల్‌‌‌‌ డిమాండ్ కనిపించింది.  మొత్తంగా 2023 లో ఇండియన్ ఆటో ఇండస్ట్రీ  మంచి పెర్ఫార్మెన్స్ చేసింది.  

వివిధ కంపెనీల అమ్మకాలు ఇలా..

1. మారుతి

కిందటి నెలలో  1,37,551 కార్లను సేల్ చేసిన మారుతి సుజుకీ, 2023 మొత్తంలో 20 లక్షలకు పైగా బండ్లను అమ్మింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు కొద్దిగా తగ్గాయి.  అయినప్పటికీ కిందటేడాదిని మంచి నెంబర్లతో ముగించింది. కంపెనీ ఎగుమతులు 2,69,046 బండ్లకు పెరగడం విశేషం.  

2.  హ్యుందాయ్‌‌‌‌ మోటార్స్‌‌‌‌

హుందాయ్ మోటార్స్ 2023 లో ఏకంగా 7,65,786 బండ్లను అమ్మింది. అంతకు ముందు ఏడాదిలో సేల్ చేసిన 7,00,811 వెహికల్స్‌‌‌‌తో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ.   కంపెనీ డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో 6,02,111 బండ్లను సేల్ చేసింది.  ఒక ఏడాదిలో జరిపిన హయ్యెస్ట్‌‌‌‌ సేల్స్ ఇవే. హ్యుందాయ్ మోటార్స్‌‌‌‌ 2022 లో 1,48,300 వెహికల్స్‌‌‌‌ను ఎగుమతి చేయగా, 2023 లో 1,63,675 యూనిట్లను ఎగుమతి చేసింది. కిందటి నెలలో  డొమెస్టిక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో 42,750 కార్లను హ్యుందాయ్‌‌‌‌ అమ్మగలిగింది.

3. ఎంజీ మోటార్స్‌‌‌‌

ఎంజీ మోటార్స్ సేల్స్ 2023 లో 18 శాతం వృద్ధి చెందాయి.  మొత్తం 56,902 కార్లను  కంపెనీ సేల్ చేయగలిగింది. ఇందులో 25 శాతం బండ్లు ఎలక్ట్రిక్‌‌‌‌వి కావడం విశేషం. ఎంజీ మోటార్స్‌‌‌‌  కామెట్‌‌‌‌ ఈవీ  సేల్స్ 20 వేల మార్క్‌‌‌‌ను దాటింది.

4. టయోట కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌..

టయోట కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌   2023 లో 2,33,346 యూనిట్లను అమ్మింది. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో 2,21,356 బండ్లను సేల్ చేసింది.

మరిన్ని కంపెనీలు..

1. ఐషర్ మోటార్స్  కిందటి నెలలో 63,387 బండ్లను సేల్ చేసింది. ఇంజిన్ కెపాసిటీ 350 సీసీ లోపు  ఉన్న బండ్లు 55,40‌‌‌‌‌‌‌‌1 అమ్ముడయ్యాయి.  350 సీసీ  కెపాసిటీని దాటిన బండ్ల సేల్స్‌‌‌‌ 11 శాతం పెరిగి 7,986 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఎగుమతులు మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 29 శాతం తగ్గి 6,906 యూనిట్లకు పడ్డాయి.

2. టీవీఎస్‌‌‌‌ మోటార్స్‌‌‌‌ టూవీలర్ సేల్స్‌‌‌‌ 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 27 శాతం (ఇయర్ ఆన్ ఇయర్ ) పెరిగి  2.90 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.  అదే మొత్తం బండ్ల అమ్మకాలు 3.02 లక్షల యూనిట్ల మార్క్‌‌‌‌ను టచ్ చేసింది. డొమెస్టిక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో టూవీలర్ అమ్మకాలు 33 శాతం పెరిగి 2.15 లక్షల యూనిట్లకు చేరుకోగా, టూవీలర్ ఎగుమతులు 13 శాతం పెరిగి 75,076 యూనిట్లుగా రికార్డయ్యాయి. కంపెనీ త్రీ వీలర్ సేల్స్‌‌‌‌ 17.5 శాతం పెరిగి 11,834 యూనిట్లకు చేరుకున్నాయి.

3. బజాజ్ ఆటో  కిందటి నెలలో 2.83 లక్షల టూవీలర్లను అమ్మగలిగింది.  డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో డిమాండ్ కొనసాగడంతో కంపెనీ సేల్స్ 15 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌) పెరిగాయి.  కంపెనీ మొత్తం అమ్మకాలు 3.27 లక్షల యూనిట్లకు పెరగగా,  త్రీవీలర్ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 43,805 యూనిట్లుగా రికార్డయ్యాయి.