పాత సామాన్లతో కారు

V6 Velugu Posted on Mar 07, 2021

చిన్నప్పటి నుంచి కొత్త విషయాల్ని కనిపెట్టాలనే ఆసక్తి.. ఆ కుర్రాడిని ఇంజినీర్‌ని చేసింది. పనికి రావని పడేసిన పాత సామాన్లతో ఏకంగా ఓ కారును తయారు చేసేలా చేసింది. ఈ కుర్రాడిని ఒకప్పుడు ‘పిచ్చోడు’ అన్న వాళ్లే ఇప్పుడు ‘జీనియస్’ అని తెగ పొగిడేస్తున్నారు.  ‘‘ఘనా ఎలన్ మస్క్’ గా పేరు సంపాదించుకున్న కెల్విన్ ఒడార్టెయిన్ సక్సెస్ స్టోరీ ఇది. 

కెల్విన్‌‌‌‌‌‌‌‌ వయసు పంతొమ్మిది. ఘనా దేశంలో ఓ మారుమూల పల్లె. తండ్రి బార్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తుంటాడు, తల్లి చిరువ్యాపారి. కెల్విన్‌‌‌‌‌‌‌‌కి చిన్నప్పటి నుంచి పాత సామాన్ల పిచ్చిఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేవాడు. ఏడేళ్ల వయసు నుంచే బొమ్మల మోటర్లు తీసేసి.. టాయ్‌‌‌‌‌‌‌‌ ఎరోప్లేన్‌‌‌‌‌‌‌‌, వాక్యూమ్ క్లీనర్‌‌‌‌‌‌‌‌, రోబోలు తయారు చేశాడు. పదేళ్ల వయసొచ్చేసరికి ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ కావాలని ఫిక్స్‌‌‌‌‌‌‌‌ అయ్యాడుపదిహేనేళ్లకు ఆ కోరిక ముదిరిపోయి..   కారును తయారుచేయాలనే ప్లాన్‌‌‌‌‌‌‌‌ గీసుకున్నాడుడాక్టర్ అవుతాడని కలలు కన్న ఆ తల్లి..  ఇనుప సామాన్ల మధ్య కొడుకును చూసే సరికి రగిలిపోయేదిపైసా సాయం ఇవ్వకుండా తన్ని తరిమికొట్టేది.   దీంతో ఫ్రెండ్స్ సాయంతో ఓ చిన్న షెల్టర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుచేసుకుని..  కారు తయారీ మొదలుపెట్టాడు.

పాత సామాన్లు అమ్మి.. చెత్త నుంచి కారును తయారు చేయడానికి కెల్విన్‌‌‌‌‌‌‌‌కి మూడేళ్ల టైం పట్టిందికార్ల షోరూంలు, గ్యారేజ్‌‌‌‌‌‌‌‌ల చుట్టూ తిరిగి వాటి లోపలి భాగాల గురించి తెలుసుకున్నాడుజంక్‌‌‌‌‌‌‌‌ యార్డ్స్‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ సైట్ల వెంట తిరిగి విడిభాగాలు ఏరుకొచ్చాడు. వాటితో పై మెరుగులు అద్దాడుఅయితే ఇంజిన్ కోసం డబ్బు అవసరం పడింది. దీంతో రోడ్ల మీద కూల్‌‌‌‌‌‌‌‌డ్రింక్స్‌‌‌‌‌‌‌‌ అమ్మాడు. చెత్త ఏరుకుంటూ..  వచ్చిన డబ్బుతో ఎట్టకేలకు ఇంజిన్‌‌‌‌‌‌‌‌ కొన్నాడు. మొత్తానికి కారు తయారయ్యింది. మూడు వేల డాలర్లతోనేలాంబాగినిమోడల్‌‌‌‌‌‌‌‌ తరహాలో  ఓ కారును తయారు చేశాడు. మొదట్లో ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్ ఫెయిల్. 2020 చివర్లో ఎట్టకేలకు తన కారును రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. ఆ ఊరిలో అదే మొదటి కారు కావడంతో అంతా నోళ్లు వెళ్లబెట్టారుకెల్విన్ టాలెంట్ గురించి తెలిసి కనటంక కంపెనీ సీఈవో స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఆ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌తో ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్ కోర్సు చేయబోతున్నాడు కెల్విన్‌‌‌‌‌‌‌‌. ‘‘కలలు కనాలి. ఎవరో నవ్వుతారని వాటిని నెరవేర్చుకోవడం ఆపొద్దు. గొప్ప ప్రయత్నాలకూ ఆటంకాలు ఎదురయ్యే ఉంటాయి. అలాగని అవి ఆగిపోలేదు కదా’’ అంటాడు కెల్విన్‌‌‌‌‌‌‌‌

 

 

Tagged Made

Latest Videos

Subscribe Now

More News