ఫారెస్ట్ ఆఫీసర్లకు ఐపీసీ కేసుల నమోదు అధికారం లేదు : హైకోర్టు

ఫారెస్ట్ ఆఫీసర్లకు  ఐపీసీ కేసుల నమోదు అధికారం లేదు : హైకోర్టు
  • ఓ కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఐపీసీ) సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద కేసు నమోదు చేసే అధికారం ఫారెస్ట్ ఆఫీసర్లకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం.. అటవీ శాఖ అధికారులు పోలీసు అధికారులు కారని తెలిపింది. వారికి కేవలం వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారిపై దాడి చేశారంటూ నమోదు చేసిన ప్రాథమిక నేర నివేదిక (పీఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాయిరోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.శ్రీనివాసరావు ఇటీవల విచారణ చేపట్టారు.

పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 27, 56తోపాటు ఐపీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 351, 332, 333 కింద కేసులు నమోదు చేశారన్నారు. ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు లేదన్నారు. పులుల సంరక్షణ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..మన్ననూరు పులుల సంరక్షణ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి అధికారిపై దాడికి పాల్పడ్డారన్నారు.

అందువల్ల వన్యప్రాణుల సంరక్షణ చట్టంతోపాటు ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ ప్రకారం ఐపీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఫారెస్ట్ ఆఫీసర్లకు లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఐపీసీ కింద కేసులను కొనసాగించినట్లయితే చట్టప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుందన్నారు. అందువల్ల ఐపీసీ కింద ఉన్న కేసులను కొట్టివేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరించారు. ఐపీసీ కింద పిటిషనర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని న్యాయమూర్తి పేర్కొన్నారు.