22 సంస్థలకు ఆధార్ వెరిఫికేషన్​ అనుమతి

22 సంస్థలకు ఆధార్ వెరిఫికేషన్​ అనుమతి

న్యూఢిల్లీ: ఖాతాదారుల ఆధార్ అథెంటికేషన్​ చేయడానికి అమెజాన్ పే (ఇండియా),  హీరో ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌కార్ప్‌‌‌‌తో సహా 22 ఆర్థిక సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.    పీఎంఎల్​ఏ చట్టం ప్రకారం ఇవన్నీ రిపోర్టింగ్​ సంస్థలు కాబట్టి ఇది వరకే ఆధార్ నంబర్‌‌‌‌లను ఉపయోగించి ఖాతాదారుల గుర్తింపును వెరిఫై చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ 22 ఆర్థిక సంస్థలలో గోద్రెజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్​ఎల్​ ఫైనాన్స్,  మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి. ఈ విషయమై నాంగియా అండర్సన్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ పార్ట్​నర్​ సందీప్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా మాట్లాడుతూ, బ్యాంకింగ్ కంపెనీలే గాక పీఎంఎల్​ఏ లిస్టెడ్​ సంస్థలు కూడా ఆధార్​ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసిందని చెప్పారు. ఈ మేరకు 22 ఆర్థిక సంస్థలు/ఇంటర్ ​మీడియేటరీల లిస్టును విడుదల చేసిందని వెల్లడించారు. ఇవి ఖాతాదారులు/ బెనిఫిషియల్ ​ఓనర్ల గుర్తింపును వెరిఫై చేయడానికి ఆధార్ అథెంటికేషన్ ​విధానాన్ని వాడుకోవచ్చని జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా చెప్పారు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం పాస్‌‌‌‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులతోనూ వెరిఫికేషన్​ చేయవచ్చు. వీటిలో దేనిని ఎంచుకోవాలనేది క్లయింట్​ ఇష్టమని జున్​జున్​వాలా వివరించారు.  వ్యక్తుల గుర్తింపు సమాచారం,  వెరిఫికేషన్​ రికార్డులను రక్షించడానికి మనీలాండరింగ్ చట్టం.. రిపోర్టింగ్ సంస్థలు ఆధార్ నంబర్,  క్లయింట్  బయోమెట్రిక్ సమాచారాన్ని సేవ్​ చేయకుండా నిషేధించింది.