మలక్ పేట,వెలుగు: చంపాపేట హిట్ అండ్ రన్ కేసులో 21 ఏండ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. పోలీసుల వివరాల ప్రకారం.. రూట్స్ కాలేజీకి చెందిన విద్యార్థి సాయి చరణ్ ఈ నెల 17న కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ బైక్ను ఢీకొట్టి పరారయ్యాడు.
ఈ ఘటనలో సునీల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
