మారుపేర్లతో మోసం చేస్తున్నారు.. జాగ్రత్త!

మారుపేర్లతో మోసం చేస్తున్నారు.. జాగ్రత్త!
  • సైబర్ నేరాలపై అంజనీ కుమార్ కామెంట్స్

హైదరాబాద్: సెల్ ఫోన్ చేతిలో ఉందని.. డేటా ఫ్రీ ఉందని.. సోషల్ మీడియాలో ప్రపంచంలో అదేపనిగా విహరిస్తున్నారా.. అవసరం ఉన్న వాటిని మినహా మరే ఇతర వాటి జోలికి వెళ్లినా దెబ్బతినడం ఖాయమని అనేక నేరాల్లో రుజువైందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సైబర్ క్రైమ్ భాగా పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
జోకర్ మాల్ వేర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినా మారుపేర్లతో వస్తోంది 
జోకర్ మాల్ వేర్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ నేరగాళ్లు మళ్లీ మళ్లీ మారు పేర్లతో దీన్ని పంపించి సైబర్ నేరాలు చేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఇది ఎక్కువగా జోకర్ ఫోటోతో వస్తోందని ఆయన హెచ్చరించారు. వెబ్ సైట్ ఓపెన్ చేస్తే జోకర్ బొమ్మ వచ్చిందంటే వెంటనే క్లిక్ చేస్తే అంతేసంగతులని ఆయన హెచ్చరించారు. 
ప్రజలు మోసపోకూడదంటే ఏం చేయాలంటే
ప్రజలు మోసపోకుండా.. నస్టపోకుండా.. దెబ్బతినకుండా ఉండాలంటే తమకు తెలియని వెబ్ సైట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు అని ఆయన హెచ్చరించారు. అపరిచిత వెబ్ సైట్లను తెరిస్తే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి అవసరం ఉన్న వాటిని.. బాగా తెలిసిన వాటిని మినహా బోర్ కొడుతోందని.. ఆకర్షణీయంగా కనిపించాయని క్లిక్ చేస్తూ వెళితే కచ్చితంగా దెబ్బతింటారని ఆయన హెచ్చరించారు.