బీజింగ్: వెనెజువెలా ప్రెసిడెంట్నికోలస్ మదురోను, ఆయన భార్యను బలవంతంగా బంధించి దేశం నుంచి బయటకు తీసుకెళ్లడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికాను కోరింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఆదివారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నది.
