కమల్ పార్టీకి గుడ్ బై చెప్పిన సికె కుమరవెల్‌

కమల్ పార్టీకి గుడ్ బై చెప్పిన సికె కుమరవెల్‌

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) అధినేత కమల్‌ హాసన్ పార్టీని నేతలు ఒక్కొక్కరిగా వీడిపోతున్నారు. గురువారం కూడా కీలక నేత సీకే కుమరవెల్‌ పార్టీని వీడారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలువలేక పోయింది. దీంతో నేతలంతా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పార్టీ ఓటమికి నైతికంగా బాధ్యత వహిస్తూ MNMను వీడుతున్నట్లు కుమరవెలి చెప్పారు. ఈయనతో కలిపి పార్టీని వీడిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అంతకముందు MNM  ఉపాధ్యక్షుడు ఆర్‌. మహేంద్రన్‌, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ బాబు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.